పారితోషికం పెంచేస్తూ వెళుతోన్న పూజా హెగ్డే!
Advertisement
'ఒక లైలా కోసం' .. 'ముకుంద' వంటి ఒక మాదిరి సినిమాలు చేసిన పూజా హెగ్డే, ఆ తరువాత బాలీవుడ్లోకి వెళ్లి 'మొహంజోదారో' చేసింది. అక్కడ ఆ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడటంతో, ఆమె అయోమయంలో పడిపోయింది. టాలీవుడ్ కి వెళ్లడమే బెటర్ అనుకునే నిర్ణయానికి ఆమె వచ్చేసరికే ఆలస్యమైపోయింది. దాంతో తెలుగులో ఆమెకి మళ్లీ ఛాన్సులు రావడం .. నిలదొక్కుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు.

కానీ 'అరవింద సమేత' .. 'మహర్షి' .. 'గద్దలకొండ గణేశ్' చిత్రాల విజయాలు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. 'గద్దలకొండ గణేశ్' సినిమా కోసం కోటికిపైగా పారితోషికాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ జోడీగా చేస్తోన్న సినిమా కోసం 2 కోట్లకి పైగా తీసుకుంటోందట. 'అల వైకుంఠపురములో' హిట్ అయితే ఆమె పారితోషికం 3 కోట్లకు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశ విధాలా దశ తిరిగిపోవడమంటే ఇదేనేమో.
Mon, Oct 14, 2019, 12:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View