జగన్, చిరంజీవి భేటీపై చెవిరెడ్డి పేరుతో వచ్చిన ట్వీట్.. ఖండన!
Advertisement .b
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి నేడు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయన... ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో సమావేశం కానున్నారు. చిరంజీవి వెంట ఆయన తనయుడు రాంచరణ్ కూడా వెళ్తున్నారు. దసరా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించిన 'సైరా' చిత్రాన్ని వీక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వీరు కోరే అవకాశం ఉంది.

మరోవైపు జగన్, చిరంజీవిల భేటీ సందర్భంగా ఓ ట్వీట్ వేడి పుట్టిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరుతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 'జగన్ అరెస్ట్ సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రాంచరణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే రాంచరణ్ తన తండ్రితో కలిసి జగన్ ను కలవాలనుకుంటున్నారు. అంతా కాల మహిమ' అనేది ఈ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ పై కౌంటర్ రీట్వీట్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. చివరకు చెవిరెడ్డి ఈ విషయంలో కలగజేసుకోవాల్సి వచ్చింది. తనకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదని ఆయన చెప్పారు. దీంతో, వివాదం సద్దుమణిగింది.
Mon, Oct 14, 2019, 11:38 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View