ఉత్కంఠను పెంచుతోన్న 'ఖైదీ' ట్రైలర్
Advertisement
హీరో కార్తీ హిట్ అనే మాట వినేసి చాలా కాలమైంది. అందువలన ఈ సారి ఆయన కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి అవకాశం ఇచ్చాడు. ఈ దీపావళికి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పాటలు .. రొమాన్స్ వుండవంటూ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ట్రైలర్ ను వదిలారు. 840 కోట్ల రూపాయల ఖరీదు చేసే 900 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేయడం .. మాఫియా లీడర్ తన అనుచరులపై విరుచుకుపడటం .. జైల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తోన్న ఆదిశంకరం అనే ఖైదీగా కార్తీ పరిచయం .. జైలు నుంచి తప్పించుకున్న ఆయన కోసం పోలీసుల గాలింపు వంటి ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఉత్కంఠను పెంచుతోంది. "ఏందీ చస్తామని భయమేస్తుందా .. చావునైనా ఎదిరించి చావాలి సార్ .. ఇలా కాళ్ల మీదపడి కాదు" అంటూ కార్తీ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.
Mon, Oct 14, 2019, 11:35 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View