'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల తేదీ వాయిదాపడే అవకాశం?
Advertisement .b
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.వివిధ కారణాల వలన ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వస్తోందట. అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేమనే అభిప్రాయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. సాధ్యమైనంతవరకూ వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట. అదీ కుదరకపోతే .. 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Mon, Oct 14, 2019, 11:09 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View