మహేశ్ బాబుకి హ్యాట్రిక్ హిట్ పడుతుందా?
Advertisement .b
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మహేశ్ బాబు, త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు.

ఇంతకు ముందు ఆయన చేసిన 'భరత్ అనే నేను' .. 'మహర్షి' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడట. అంతేకాదు ఈ సినిమా కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయనీ, తన అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తాయని సన్నిహితులతో చెబుతున్నాడట. ఈ సినిమాలో తన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగా ఉంటుందనీ, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడట. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Mon, Oct 14, 2019, 10:43 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View