సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement .b
*  కథానాయిక సమంత ప్రస్తుతం 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ లో ఆమె నెగటివ్ ఛాయలతో కొనసాగే పాత్ర పోషిస్తుందట. దాంతో ఇందులో ఫైట్స్ కూడా చేస్తుందని, అందుకోసం ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోందని సమాచారం.
*  ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయనకు 30 కోట్ల పారితోషికం అందజేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  ఈ ఏడాది మొదట్లో వచ్చిన మలయాళ సినిమా 'ఇష్క్'ను ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ దీని రీమేక్ హక్కులను తీసుకుంది. ప్రస్తుతం నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటోంది. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో ఈ మలయాళ చిత్రం రూపొందింది.
Mon, Oct 14, 2019, 07:30 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View