ఆమె ఒక డాక్టర్.. నా జీవితంలో చాలా స్పెషల్: హీరో నిఖిల్
Advertisement
తన జీవితంలో ఒక అమ్మాయి చాలా స్పెషల్ అని, ఆమె ఒక డాక్టర్ అంటూ తన ప్రేమ విశేషాలను సినీ హీరో నిఖిల్ పంచుకున్నాడు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' షోలో ఈ వివరాలను వెల్లడించాడు. తనను ఆమె బాగా అర్థం చేసుకుంటుందని చెప్పాడు.

షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు కానీ తాను డిస్టర్బ్ చేయదని... నువ్వు ఎప్పుడు సరదాగా గడపాలనుకుంటే అప్పుడు గడుపు అని చెబుతుందని తెలిపాడు. ఏరోజూ తన ఫోన్ కూడా చెక్ చేయదని చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందనే ఆలోచన ఆమెదని తెలిపాడు. తనకు ప్రేమపెళ్లిపై ఇష్టం పెరగడానికి షారుఖ్ ఖాన్ సినిమాలే కారణమని చెప్పాడు. ప్రస్తుతం 'అర్జున్ సురవరం' చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలవుతోంది.
Sun, Oct 13, 2019, 01:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View