నటి మంజు వారియర్‌ను ఆహ్వానించి అభినందించిన కమల్
Advertisement
అసురన్ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి మంజు వారియర్‌కు సూపర్ స్టార్ కమలహాసన్ నుంచి ప్రశంసలు లభించాయి. ధనుష్, మంజు జంటగా నటించిన అసురన్ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ధనుష్, మంజు నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

తాజాగా ఈ సినిమాను చూసిన కమలహాసన్, శ్రుతిహాసన్‌లు కూడా సినిమాపై  ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక, మంజును స్వయంగా ఇంటికి ఆహ్వానించి అభినందించారు. అద్భుతంగా నటించావంటూ ఆకాశానికెత్తేశారు. మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని ఈ సందర్భంగా కమల్ కోరారు.
Sun, Oct 13, 2019, 09:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View