నా రెమ్యునరేషన్ భారీగా పెరిగింది.. కానీ,..: తాప్సీ 
Advertisement
టాలీవుడ్ లో కొంచెం స్పీడు తగ్గినా... బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది తాప్సీ. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

గత రెండ్లేళ్లలో తన రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని... అయితే తనతో పాటు నటిస్తున్న నటులతో పోల్చితే తక్కువేనని చెప్పింది. ఒకేసారి ఎక్కువగా సంపాదించేయాలనే కోరిక తనకు లేదని తెలిపింది. తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పింది. రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఇతరుల దయపై ఆధారపడేదాన్నని... ఇప్పుడు సినిమాలు తననే వెతుక్కుంటూ వచ్చేంత స్థాయికి చేరుకున్నానని చెప్పింది.
Sun, Oct 13, 2019, 09:06 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View