'రాజుగారి గది 3'లో తమన్నాను అందుకే తీసుకోలేదట!
Advertisement .b
ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 'రాజుగారి గది 2' సినిమాను భారీగా తీసినా ఆశించినస్థాయిలో అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన 'రాజుగారి గది 3' సినిమాను రూపొందించాడు. అశ్విన్ ప్రధాన పాత్రధారిగానే ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ, 'రాజుగారి గది 2' సినిమాలో కామెడీ పాళ్లు తగ్గాయనే విమర్శ వచ్చింది. అందువలన ఈ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగానే ఉండేలా చూశాము. ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. మరో కీలకమైన పాత్ర కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్ కుదరకపోవడం వలన అవికా గోర్ ను తీసుకున్నాము. ఈ పాత్రకి అవికా కరెక్ట్ అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.
Sat, Oct 12, 2019, 05:06 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View