300 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న 'వార్'
Advertisement
హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా రూపొందిన 'వార్' సినిమా, ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ యాక్షన్ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలివారం రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఈ సినిమా, 10వ రోజు పూర్తయ్యేనాటికి 250 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఇక ఈ ఒక్క రోజునే ఈ సినిమా 9 కోట్ల రూపాయలను వసూలు చేస్తోందని అంచనా. 300 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది 'కబీర్ సింగ్' తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవడం విశేషం. ఇక దక్షిణాదిన కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనించదగిన విషయం.
Sat, Oct 12, 2019, 04:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View