పారితోషికాన్ని డిమాండ్ చేసే సత్తా ఆ ముగ్గురు హీరోయిన్లకి మాత్రమే వుంది: ప్రియమణి
Advertisement
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి, ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా వుంది. హీరోయిన్స్ కి సంబంధించిన పారితోషికాల గురించిన ప్రశ్న ఆమెకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. "తమ టాలెంట్ కి తగిన పారితోషికం దక్కడం లేదని చాలామంది హీరోయిన్స్ అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?" అనే ప్రశ్నకి ప్రియమణి తనదైన శైలిలో స్పందించారు.

"ఉత్తరాది విషయం అలా ఉంచితే, దక్షిణాదిన పారితోషికాన్ని డిమాండ్ చేసే పరిస్థితి నయనతార .. అనుష్క .. సమంతలకు మాత్రమే వుంది. వాళ్లకి గల డిమాండ్ ను బట్టి తమకి ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని నిర్మాతల నుంచి రాబట్టుకోగలుగుతున్నారు. మిగతా హీరోయిన్లకి అలా డిమాండ్ చేసే అవకాశం లేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.
Sat, Oct 12, 2019, 02:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View