ఆసక్తిని రేపుతోన్న 'తోలుబొమ్మలాట' మోషన్ పోస్టర్
12-10-2019 Sat 13:02
- 'సోడాల్రాజు'గా రాజేంద్ర ప్రసాద్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, గ్రామీణ నేపథ్యంలో 'తోలుబొమ్మలాట' రూపొందుతోంది. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. నేపథ్యంలో వీలునామాకి సంబంధించి వినిపించే మాటలతో ఈ మోషన్ పోస్టర్ ను వదిలిన తీరు బాగుంది.
రక్తసంబంధాలు .. ఆర్ధిక సంబంధాలుగా మారిపోయే నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయం ఈ మోషన్ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మధ్య వయస్కుడిగా రాజేంద్రప్రసాద్ లుక్ బాగుంది. ఈ సినిమాలో ఆయన 'సోడాల్రాజు'(సోమరాజు) అనే పాత్రలో కనిపించనున్నారు. దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ .. విశ్వంత్ .. హర్షిత .. కల్పన .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
3 minutes ago

రేపే విదేశీ పర్యటనకు జగన్... 10 రోజుల పాటు అక్కడే
39 minutes ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
54 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
1 hour ago

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు మూవీలో నాని?
1 hour ago

200 కోట్ల గ్రాస్ దిశగా 'సర్కారువారి పాట'
2 hours ago
