ఫ్లాష్ బ్యాక్: తనపై ఒక ముద్ర పడకుండా ఉండాలనే ఏఎన్నార్ అలా చేశారట!
Advertisement
రచయితగా .. సీనియర్ జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఏఎన్నార్ గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. "నేను 'విజయచిత్ర' పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనను నేను చాలా దగ్గరగా పరిశీలించాను. ఆయనలో పట్టుదల ఎక్కువనే విషయం నాకు అర్థమైంది. ఈ కారణంగానేనేమో ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని అనిపించింది.

తొలినాళ్లలో ఏఎన్నార్ జానపద చిత్రాల్లో ఎక్కువగా చేయడంతో ఆయన జానపదాలు మాత్రమే చేగలడనే ప్రచారం జరిగింది. దాంతో ఆయన 'సంసారం' అనే సాంఘిక చిత్రంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపించి ఆ నిందను పోగొట్టుకున్నారు. 'దేవదాసు' తరువాత ఏఎన్నార్ కి ట్రాజెడీ కింగ్ అనే పేరు వచ్చింది. ఆ తరహా పాత్రలే చేయగలడని అనుకున్నారు. ఆ వెంటనే ఆయన 'మిస్సమ్మ'లో కామెడీ చేశారు. 'భూకైలాస్'లో నారదుడిగాను మెప్పించారు. ఇలా అక్కినేని ఏ పాత్రనైనా చేయగలరని అంతా అనుకోవడానికిగాను ఆయన ఎంతో శ్రమించారు" అని చెప్పుకొచ్చారు.
Sat, Oct 12, 2019, 11:47 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View