వెంకటేశ్ తో సినిమాను ఖరారు చేసుకున్న వినాయక్
Advertisement .b
తేజుతో 'ఇంటెలిజెంట్' వంటి ఫ్లాప్ సినిమా చేసిన తరువాత మరో ప్రాజెక్టును వినాయక్ పట్టాలెక్కించలేకపోయాడు. బాలకృష్ణతో ఓ భారీ సినిమా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత రవితేజతో ఓ మాస్ మసాలా మూవీ చేయాలని చూశాడు. కొన్ని కారణాల వలన అది కూడా కుదరలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక మంచి కథను సిద్ధం చేసుకుని వెంకటేశ్ కి వినిపించగా వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ తనే హీరోగా 'శీనయ్య' అనే సినిమా చేస్తున్నాడు. మరోపక్క, తరుణ్ భాస్కర్ తో సినిమాకి వెంకటేశ్ సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం.
Sat, Oct 12, 2019, 10:00 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View