'తలైవి' కోసం షూటింగుకి దిగుతోన్న కంగనా
Advertisement .b
అందాల కథానాయికగా .. సమర్థురాలైన రాజకీయ నాయకురాలిగా దివంగత జయలలిత ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు వున్నాయి. అందువలన ఆమె బయోపిక్ ను 'తలైవి' పేరుతో దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్నాడు.

జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేయనుంది. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. జయలలిత యుక్త వయసుకి సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టుగా చెబుతున్నారు. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి .. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించనున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల చేనున్నారు.
Sat, Oct 12, 2019, 09:32 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View