సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement .b
*  మిల్కీ బ్యూటీ తమన్నా ఇంతవరకు స్క్రీన్ మీద ఏ హీరోకీ ముద్దు ఇవ్వలేదట. ఈ విషయాన్ని తాజాగా తనే చెబుతూ, 'మొదటి నుంచీ నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. ఇంతవరకు లిప్ లాక్ కిస్ సీన్ అన్నది చేయలేదు. చేయను కూడా. అది నా కాంట్రాక్టులోనే స్పష్టంగా వుంటుంది' అని తెలిపింది.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'సామజ వర గమన' పాటను ఇటీవల విడుదల చేయగా డిజిటల్ ప్రపంచంలో అది దూసుకుపోతోంది. ఇప్పటివరకు 30 మిలియన్ల డిజిటల్ హిట్స్ ను ఇది సాధించడం విశేషం.
*  'సైరా' విడుదలైన మూడు రోజులకే విడుదలైన గోపీచంద్ 'చాణక్య' సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతిన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 12 కోట్ల వరకు జరగగా, సినిమా విడుదలైన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలైన షేర్ 3.9 కోట్లు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
*  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేశ్ (బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి విదితమే. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ ను అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Sat, Oct 12, 2019, 07:37 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View