జయప్రదను ఇబ్బందులకు గురిచేసిన నిర్ణయాలు ఇవేనట!
Advertisement
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, జయప్రదను గురించి ప్రస్తావించారు. "జయప్రద కెరియర్ తొలినాళ్ల నుంచి ఆమెతో నాకు మంచి పరిచయం వుంది. అందాల కథానాయికగా ఆమె చాలా వేగంగా ఎదిగారు. సత్యజిత్ రే వంటి ప్రసిద్ధ దర్శకుడు జయప్రదతో సినిమా చేయాలని ఉందనే స్థాయికి ఆమె చేరుకున్నారు.

అంతటి స్టార్ డమ్ చూసిన జయప్రద .. ముగ్గురు పిల్లలు వున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహం కారణంగా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆమె తన సోదరులను హీరోలుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో, తన డబ్బుతో గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సినిమాలు ఆడకపోవడం వలన భారీ నష్టాలు చూశారు. ఇక రాజకీయాల్లో చేరి పార్టీలు మారిపోతూ చెప్పుకోదగిన స్థాయిలో ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. ఇలా జయప్రద తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను బాగానే ఇబ్బంది పెట్టాయి"అని చెప్పుకొచ్చారు.
Thu, Oct 10, 2019, 05:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View