బాలచందర్ మరో ఛాన్స్ ఇవ్వనందుకు బాధపడిన జయప్రద
Advertisement
తెలుగు తెరపై అసలైన అందానికి అర్థం చెప్పిన కథానాయికల జాబితాలో జయప్రద పేరు ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి జయప్రదను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "తెలుగు తెరకు 'భూమికోసం' చిత్రం ద్వారా జయప్రద పరిచయమయ్యారు. అప్పటివరకూ 'లలితారాణి'గా వున్న ఆమె పేరు, రెండవ సినిమా 'నాకూ స్వతంత్రం వచ్చింది'తో జయప్రదగా మారింది. ఈ రెండు సినిమాల తరువాత ఆమె ఫొటోలను 'విజయచిత్ర' పత్రికలో ప్రచురించాము.

బాలచందర్ గారి 'అంతులేని కథ' నటిగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత నేను ఒకసారి ఆమెను కలిసినప్పుడు, "బాలచందర్ గారు నాకు మరో అవకాశం ఇవ్వలేదు .. నా గురించి ఆయనకి ఎవరేం చెప్పారో తెలియదు" అని ఆమె బాధపడ్డారు. కొన్నిరోజుల తరువాత నేను బాలచందర్ గారిని కలవాల్సి వచ్చింది. ఆయన కొత్త సినిమా నటీనటుల జాబితా చూశాను .. అందులోను జయప్రద పేరు లేదు. అప్పుడు నా దగ్గర జయప్రద బాధపడటం గురించి చెప్పాను. ఆయన ఏమనుకున్నాడో తెలియదుగానీ, ఆ సినిమాలో ఆమెకి అవకాశం ఇచ్చారు. అందుకు జయప్రద ఎంతో సంతోషించారు" అని చెప్పుకొచ్చారు.
Thu, Oct 10, 2019, 03:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View