'బిగ్ బాస్'ను బ్యాన్ చేయవలసిందే: కర్ణిసేన డిమాండ్
Advertisement .b
మొదటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కుంటూనే బాలీవుడ్లో బిగ్ బాస్ షో కొనసాగుతోంది. అలా ప్రస్తుతం ఈ రియాలిటీ షో 13వ సీజన్ జరుపుకుంటోంది. ఈ సీజన్ కి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. భారతీయ సంప్రదాయాలకి విరుద్ధంగా వున్న ఈ షోను వెంటనే నిలిపివేయాలని రాజస్థాన్ కి చెందిన 'కర్ణిసేన' డిమాండ్ చేస్తోంది.

కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని విధంగా వున్న ఈ రియాలిటీ షోను వెంటనే బ్యాన్ చేయాలంటూ,కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కి 'కర్ణిసేన' ప్రతినిధులు ఒక లేఖను సమర్పించారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తోన్న ఈ షోను తక్షణమే నిలిపివేయాలంటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా వారు ఒక లేఖను అందజేశారు.
Thu, Oct 10, 2019, 02:50 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View