తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను రాబట్టిన 'సైరా'
Advertisement .b
భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో 'సైరా' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని భాషల్లోను విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం.

'సైరా'కి  పోటీగా భావించదగిన సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులోనే కాకుండా విడుదలైన మిగతా భాషల్లోను ఈ సినిమా విజయకేతనాన్ని ఎగరేస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Thu, Oct 10, 2019, 01:52 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View