నేను రోడ్డుపై నడిచి వెళుతుంటే టి.రాజేందర్ నన్ను చూసి హీరోయిన్ ను చేశారు: నటి జీవిత
Advertisement
'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటి జీవిత మాట్లాడుతూ, కథానాయికగా తనకి వచ్చిన తొలి అవకాశాన్ని గురించి ప్రస్తావించారు. "మాది మధ్యతరగతి కుటుంబం. జీవితం పట్ల పెద్దగా లక్ష్యాలు ఉండేవి కావు. నేను ఆర్టిస్టును కావడం కూడా అనుకోకుండా జరిగిందే.

అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఒక రోజున నేను చెన్నైలోని 'వాణి మహల్' దగ్గర నడుచుకుంటూ వెళుతుంటే, కార్లో వెళుతూ టి.రాజేందర్ గారు నన్ను చూశారు. నా గురించిన వివరాలను అడిగిన ఆయన, 'సినిమాల్లో యాక్ట్ చేస్తావా' అని అడిగారు. 'నాకు భయం సార్ .. నేను చేయను' అన్నాను. 'సరే మీ పేరెంట్స్ తో మాట్లాడుతానులే' అని చెప్పేసి ఆయన వెళ్లిపోయారు. ఈ విషయం మా స్కూల్లో చెబితే అంతా ఆశ్చర్యపోయారు .. అదృష్టవంతురాలివి అన్నారు. ఆ తరువాత రాజేందర్ గారు మా పేరెంట్స్ ను ఒప్పించడం .. నేను హీరోయిన్ కావడం జరిగిపోయాయి" అని చెప్పుకొచ్చారు.
Thu, Oct 10, 2019, 01:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View