'కంటి వెలుగు'ని ప్రారంభించిన జగన్.. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయడానికి తీసుకొచ్చిన 'వైయస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

కంటి వెలుగు పథకం కింద మూడేళ్ల పాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అవసరమైన నేత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు తొలి దశ పరీక్షలను నిర్వహిస్తారు. తొలి దశలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో దశలో నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిని విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్సలను నిర్వహిస్తారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లు, కళ్లద్దాలను, ఇతర సేవలను ఉచితంగా అందిస్తారు. జనవరి 1 నుంచి ఈ పథకం అందరికీ అందుబాటులోకి వస్తుంది.
Thu, Oct 10, 2019, 12:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View