మహాత్ముని ఆశయ సాధనకు గాంధీ సంకల్ప యాత్ర: కన్నా లక్ష్మీనారాయణ
Advertisement
గాంధీ 150 జయంత్యుత్సవాల్లో భాగంగా గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరంలో ప్రస్తుత పరిస్థితి, ప్రగతిని ఈ సందర్భంగా తెలుసుకుంటామని చెప్పారు. అధికారులతో మాట్లాడుతామన్నారు. పోలవరం పూర్తి కావాలన్నది తమ సంకల్పమని, ఇందుకోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి పోలవరం అంశంపై చర్చిస్తామని వెల్లడించారు.
Thu, Oct 10, 2019, 12:25 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View