వరుణ్ తేజ్ కొత్త చిత్రం నుంచి కొత్త పోస్టర్
Advertisement
వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గద్దలకొండ గణేశ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ తెచ్చిన ఉత్సాహంతో వరుణ్ తేజ్ మరో ప్రాజెక్టుతో రంగంలోకి దిగుతున్నాడు. వరుణ్ తేజ్ కి ఇది 10వ సినిమా. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ సినిమా రూపొందనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. బాక్సింగ్ పంచ్ కి సంబంధించిన పోస్టర్ ను వరుణ్ తేజ్ అధికారిక ఇన్స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయంలో స్పష్టతను ఇచ్చాడు. సిద్ధు ముద్ద - అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Thu, Oct 10, 2019, 11:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View