20 ఏళ్లలో నేను చూసిన రెండో సినిమా 'సైరా': తెలంగాణ గవర్నర్ తమిళిసై
Advertisement
గడచిన 20 సంవత్సరాల్లో తాను చూసిన రెండో చిత్రం చిరంజీవి నటించిన 'సైరా' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కోరిక మేరకు సినిమాను చూసిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడారు. చిత్రంలో చిరంజీవి అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 1999 తరువాత తాను 2018లో రజనీకాంత్ నటించిన 'కాలా' చూశానని, ఆపై తాను చూసిన రెండో చిత్రం ఇదేనని ఆమె అన్నారు.

తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు. కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా' విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
Thu, Oct 10, 2019, 10:51 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View