మరో హిందీ సినిమా కోసం రంగంలోకి దిగిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు
Advertisement .b
తెలుగు చిత్రపరిశ్రమకి 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, తెలుగులోని యువ కథానాయకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరిచారు. అయితే ఆయన మాత్రం 'అర్జున్ రెడ్డి' సినిమానే హిందీలోకి 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు.

షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో ఆ సినిమా నిర్మాతలైన మురద్ కేతాని .. భూషణ్ కుమార్ ఇద్దరూ కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే మరో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వాళ్లు ట్వీట్ చేశారు. నాయకా నాయికలుగా స్టార్ హీరో హీరోయిన్ల పేర్లే వినిపిస్తున్నాయి మరి.
Thu, Oct 10, 2019, 10:49 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View