నా పేరును జీవితగా మార్చేసింది ఆ దర్శకుడే: జీవిత
Advertisement
తెలుగు తెరపై కథానాయికగా జీవిత విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా అనేక చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "మా నాన్నగారిది ద్రాక్షారామం .. మా అమ్మగారిది విజయవాడ. దాంతో రాజమండ్రి పరిసర ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం వుంది.

నా అసలు పేరు 'పద్మ' .. సీనియర్ హీరో - దర్శకుడు టి. రాజేందర్ గారు నా పేరును 'జీవిత' గా మార్చారు. నన్ను తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది టి. రాజేందర్ గారు. జయచిత్రగారి బ్రదర్ ఆ సినిమాలో హీరో. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా సమయంలోనే రాజేందర్ గారు నా పేరును 'జీవిత'గా మార్చారు. ఆ పేరు నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి ఆ పేరుతోనే కొనసాగుతూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.
Thu, Oct 10, 2019, 10:31 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View