విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలనున్న సీబీఐ కోర్టు
Advertisement
విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడకు తరలనుంది. కోర్టును తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిఫార్సుల మేరకు  కోర్టును తరలిస్తూ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఏపీకి సంబంధించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విజయవాడ నుంచి విధులను నిర్వహించనుంది. ఏపీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. కోర్టు విజయవాడకు తరలుతుండటంతో... కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Thu, Oct 10, 2019, 10:17 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View