కర్ణాటకలో మనిషి రక్తం మరిగిన పులి... కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు!
Advertisement
కర్ణాటకలోని బండీపుర అడవుల్లో మనిషి రక్తం రుచి మరిగిన పులిని కనిపిస్తే కాల్చివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక్కడి అభయారణ్యం పరిసరాల్లో సంచరిస్తున్న పులి గ్రామస్థులకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మంగళవారం నాడు చామరాజనగర్ పరిధిలోని గుండ్లు పేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు.
Thu, Oct 10, 2019, 09:30 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View