సత్తుపల్లి సమీపంలో బోల్తాకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 40 మందికి తీవ్రగాయాలు
Advertisement
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో బస్సులోని 40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి అమలాపురం వెళ్తున్న ఈ బస్సు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ శివారు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. స్పందించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులకు సేవలందించి బస్సునుంచి వారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Thu, Oct 10, 2019, 09:28 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View