సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
*  తనకి తెలుగు సినిమాలలో నటించడమే హాయిగా ఉంటుందని అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'నేను వివిధ భాషల్లో నటిస్తున్నప్పటికీ తెలుగులో చేయడమంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, తెలుగు సినిమాల షూటింగులు పక్కాగా, పంక్చువాలిటీతో జరుగుతాయి. అదే హిందీ సినిమా అయితే, ఓ వేళాపాళా వుండదు. పొద్దున్న మొదలవ్వడమే ఆలస్యంగా మొదలవుతుంది. రాత్రి తొమ్మిదింటి వరకు జరుగుతూనే వుంటుంది. దాంతో ఇంటికి వెళ్లేటప్పటికి అలసిపోతాం. అందుకే తెలుగు సినిమా షూటింగ్ అంటేనే నాకు హాయిగా వుంటుంది' అని చెప్పింది.
 *  తాజాగా చిరంజీవితో 'సైరా' చిత్రాన్ని తీసి, ప్రశంసలు అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆయన కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని అంటున్నారు.
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కి ఓ కోరిక వుందట. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ నటించిన 'దానవీర శూర కర్ణ' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలని వుందట. తన తాజా ఇంటర్వ్యూలో వినాయక్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
Thu, Oct 10, 2019, 07:45 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View