తమిళ హీరో శింభుపై నిర్మాత జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు!
Advertisement
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరో శింబుపై, భారీ చిత్రాల నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. శింబు సక్రమంగా షూటింగ్‌ కు రాని కారణంగా తన చిత్ర నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగి పోయాయని ఆయన అన్నారు.

శింభు వైఖరితో చిత్రంలో నటిస్తున్న ఇతర నటీనటుల షూటింగ్‌ కు అంతరాయం కలిగిందని, తాను వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. తన పొరపాటు లేకుండానే డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయని, దీనికి శింబు కారణమని, సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత పదిరోజుల పాటు ఒక్క సీన్ షూటింగ్ కూడా జరగలేదని మండలికి ఇచ్చిన ఫిర్యాదులో జ్ఞానవేల్ రాజా తెలిపారు.

కాగా, ఇటీవలి కాలంలో శింబుపై వస్తున్న ఫిర్యాదులు పెరిగాయి. అతను నటించిన 'కేట్టవన్', 'మన్మథన్', 'ఏఏఏ' సినిమాల విషయంలోనూ శింబు సహకరించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతనికి రెడ్‌ కార్డ్‌ ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత రెండేళ్లలో శింబు నటిస్తున్న మూడు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అతని కెరీర్ సైతం ప్రమాదంలో పడిందని చిత్రరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Thu, Oct 10, 2019, 07:44 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View