లోక్ సభ కమిటీల్లో ఏపీ ఎంపీలకు పెద్దపీట వేసిన కేంద్రం!
Advertisement
ప్రజా సమస్యలను, తమ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులు, విచారణల నిమిత్తం లోక్ సభ నియమించే వివిధ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను లోక్ సభ స్పీకర్ ఖరారు చేయగా, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట లభించింది. లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీల తరువాత అత్యధిక సభ్యులున్న పార్టీగా తృణమూల్ తో కలిసి వైసీపీ నాలుగో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా పలు కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన లోక్ సభ స్పీకర్, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును నియమించారు. ఇదే సమయంలో పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇతర కమిటీల్లోనూ సభ్యులుగా ఏపీ ఎంపీలకు సముచిత స్థానం దక్కింది.
Thu, Oct 10, 2019, 07:31 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View