హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
Advertisement
హుజూర్ నగర్ కు త్వరలో జరగనున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మద్దతుపై పునరాలోచన చేయనుంది. తెలంగాణలో ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న టీఎస్సార్టీసీ సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. సమ్మె విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచన చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. సమ్మెలో భాగంగా రేపు అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు.
Wed, Oct 09, 2019, 08:03 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View