కాకాణి స్వయానా నా మేనత్త కొడుకు.. మా మధ్య విభేదాలు లేవు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
Advertisement
వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి కి మధ్య విభేదాలను పరిష్కరించే నిమిత్తం నెల్లూరు జిల్లా నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో కోటంరెడ్డి మాట్లాడుతూ, కాకాణికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాకాణి స్వయానా తన మేనత్త కొడుకు అని తెలిపారు. ఈ సమావేశంలో ‘రైతు భరోసా’, త్వరలో జరగనున్నసీఎం సభపై మాత్రమే చర్చించామని చెప్పారు.
Wed, Oct 09, 2019, 07:01 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View