నాకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి గొడవలు లేవు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
Advertisement
నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కాకాణి గోవర్దన్ రెడ్డికి మధ్య గ్రూప్ తగాదాలు నెలకొన్నాయన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తనకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని స్పష్టం చేశారు.

కోటంరెడ్డి స్వయానా తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తాము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని అన్నారు. ఒకవేళ తమ మధ్య ఏమైనా విభేదాలు వస్తే తామే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం తమకు ఉందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తమ మధ్య వివాదాలు సృష్టించాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.
Wed, Oct 09, 2019, 06:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View