పీవోకే శరణార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
Advertisement
పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) భారత్ లో అంతర్భాగమని... దాన్ని తిరిగి భారత్ లో కలపడమే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ దిశగా భారత్ కార్యచరణను మొదలుపెట్టినట్టే కనపడుతోంది. ఇందులో భాగంగా పీవోకే ప్రజలంతా భారతీయులేనని... వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ప్రపంచ దేశాలకు వెళ్లేలా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

పీవోకే నుంచి వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలలో జీవించి, తిరిగి జమ్ముకశ్మీర్ చేరుకొని నిరాశ్రయులుగా, శరణార్థులుగా బతుకుతున్న 5,300 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమైంది. ఒక్కో శరణార్థి కుటుంబానికి రూ. 5.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలనే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, పీవోకే నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో కొన్నాళ్లు నివసించి, తిరిగి జమ్ముకశ్మీర్ లో ఆశ్రయం పొందాయని చెప్పారు. అలాంటి 5,300 కుటుంబాలను పునరావాస ప్యాకేజీలో చేర్చామని తెలిపారు.
Wed, Oct 09, 2019, 05:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View