తెలంగాణ బంద్ పై రేపు ప్రకటిస్తాం: ప్రొఫెసర్ కోదండరామ్
Advertisement
టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడాన్ని కార్మికులు నిరసిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.

అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బంద్ పై రేపు మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె గా మారుతుందని హెచ్చరించారు. సమ్మెపై గవర్నర్ తమిళిసైని కలిసి ఓ వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని, దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని కోరారు.
Wed, Oct 09, 2019, 05:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View