విచారణకు హాజరుకాని కోడెల కుమారుడు, కుమార్తె
Advertisement
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలంటూ కోడెల కుటుంబసభ్యులను పిలిచారు. అయితే, పోలీసుల నోటీసులకు కోడెల కుమారుడు, కుమార్తె స్పందించలేదు. పోలీసు విచారణకు హాజరుకాలేదు. దీంతో, గుంటూరుకు వెళ్లి వారిని విచారిస్తామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. హైదరాబాదులోని నివాసంలో ఉరి వేసుకుని కోడెల బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కోడెల మరణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.
Wed, Oct 09, 2019, 01:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View