నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రాజమండ్రి వెళ్లిన వైఎస్ జగన్!
Advertisement
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహం రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్‌ హాల్లో వైభవంగా జరుగగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అమృతవల్లి వివాహం శ్రీరంగనాథ్ తో జరిగింది. సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపే విశ్వరూప్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు ఎంపీ భరత్‌, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు విచ్చేసి, వధూవరులను ఆశీర్వదించారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని బెల్‌ వెదర్‌ స్కూల్‌ ఆవరణలో వివాహ వేడుక జరుగుతుండగా, సీఎం కాసేపట్లో తణుకుకు చేరుకోనున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పట్టణమంతా నూతన వధూవరుల ప్లెక్సీలతో నిండిపోయింది.
Wed, Oct 09, 2019, 12:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View