టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను కస్టడీకి కోరిన బంజారాహిల్స్ పోలీసులు
Advertisement
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను విచారించేందుకు గాను తమ కస్టడీకి అప్పగించాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టు విచారించనుంది. రూ. 18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు... ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా... ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.
Wed, Oct 09, 2019, 12:19 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View