ఉత్కంఠకు తెరదించిన టీడీపీ నేత గంటా శ్రీనివాస్!
Advertisement
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీకి, క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. కొంతకాలంగా ఆయన టీడీపీ కార్యాలయానికి రాలేదన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారని, మరో పార్టీలో చేరనున్నారని, ఓపక్క బీజేపీ నేతలతో చర్చిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

 అయితే, ఇవన్నీ పుకార్లేనని గంటా ఇటీవల ప్రకటించినా, ఆయనపై వస్తున్న వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా నేడు ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీ నేతలు, స్థానిక కార్యకర్తలతో పలు విషయాలపై చర్చించారు. దీంతో ఈ సమావేశానికి గంటా హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇదే సమయంలో ఆయన పార్టీలో కొనసాగే అంశంపైనా స్పష్టత వచ్చేసిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
Wed, Oct 09, 2019, 12:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View