మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ గురించి మంచు లక్ష్మికి చెప్పిన శ్రుతిహాసన్!
Advertisement
విలక్షణ నటుడు కమలహాసన్ తనయగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తానేంటో నిరూపించుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగిన శ్రుతి హాసన్, తాజాగా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోకు హాజరై, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సలేతో డేటింగ్ చేస్తూ ఎన్నో మార్లు కనిపించి, తమ నిశ్చితార్థం త్వరలో జరుగుతుందని ప్రకటించిన శ్రుతి, ఆపై అతనికి దూరమైన సంగతి తెలిసిందే. తమ పర్యటనలు, విహార యాత్రల ఫోటోలను ఎన్నింటినో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది కూడా. వీరిద్దరి బంధం ఏప్రిల్ లో ముగిసింది.

ఇక తాజాగా, మైఖేల్ తో బ్రేకప్ గురించి మాట్లాడిన శ్రుతి హాసన్, అతనితో సంబంధం తనకు మంచి అనుభవాన్ని మిగిల్చిందని చెప్పింది. ప్రస్తుతం తాను జీవితంలో ఓ సరైన వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నానని వెల్లడించింది. తాను అమాయకంగా ఉంటానని, తన చుట్టూ ఉన్నవారు తనపై ఆధిపత్యం చలాయిస్తుంటారని వ్యాఖ్యానించింది.

తనలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, తాను కోరుకుంటున్న లక్షణాలు మైఖేల్ లో కనిపించలేదని చెప్పింది. ఒకవేళ అటువంటి లక్షణాలున్న వ్యక్తి తారసపడి, తాను అతని ప్రేమలో పడితే, ప్రపంచానికి చెబుతానని చెప్పుకొచ్చింది. ఓ సమయంలో మంచిగా ఉన్న వ్యక్తి, మరో సమయంలో తనకు చెడుగా కనిపిస్తున్నాడని, ఇటువంటి ఘటనల ద్వారా తనకు జీవితం గురించి నేర్చుకునే అవకాశం కలిగిందని పేర్కొంది.
Wed, Oct 09, 2019, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View