పోలీసు అధికారి భుజాలపై కూర్చుని పేలు చూసిన వానరం!
సాధారణంగా పోలీసు అధికారులు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిత్యం కేసులు, విచారణతో తలమునకలై ఉంటారు. ఆయన కూడా ఫైళ్లు చూస్తూ అదే బిజీలో ఉన్నారు. ఆ సమయంలో ఓ వానరం స్టేషన్‌కు వచ్చింది. ఎంచక్కా ఆయన భుజాలపైకి ఎక్కింది. హాయిగా తనకు ఇష్టమైన పేలు చూస్తూ కాలం గడిపేసింది. సదరు పోలీసు అధికారితోపాటు, చూసిన సిబ్బంది కూడా తొలుత ఆశ్చర్యపోయినా కాసేపు కోతి చేష్టలతో ఆనందించాలని అలాగే ఉండనిచ్చారు. దాని చర్యను వీడియో తీశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిల్‌బిత్‌ పోలీస్‌ స్టేషన్లో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ ద్వివేది స్టేషన్‌కు వచ్చి  ఫిర్యాదుదారులు చెప్పింది వింటూ డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కాసేపు అలాగే అధికారి తల్లో పేలు వెతికిన కోతి అనంతరం దిగి వెళ్లిపోయింది.
Wed, Oct 09, 2019, 11:39 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View