సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
*  దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కథానాయిక నయనతార ప్రేమ ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పైగా, వీరి వివాహం ఇండియాలో కాకుండా విదేశాల్లో జరుగుతుందని, అతికొద్ది మంది మాత్రమే దీనికి హాజరవుతారని కోలీవుడ్ సమాచారం.
*  వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో నితిన్ నటించే చిత్రం షూటింగ్ నిన్న విజయదశమి రోజున లాంఛనంగా మొదలైంది. కాగా, ఈ చిత్రానికి స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రముఖ కెమేరామేన్ పీసీ శ్రీరాం, బిజీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తుండడం విశేషం.  
*  ఇటీవల 'బ్రోచే వారెవరురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో శ్రీవిష్ణు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. వచ్చే నెల నుంచి షూటింగ్ జరుగుతుంది.  
Wed, Oct 09, 2019, 07:26 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View