చిరంజీవి-చరణ్ కలసి నటించే సినిమా ఇదే!
Advertisement
తాజాగా తండ్రి చిరంజీవి కథానాయకుడుగా 'సైరా' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని సాధించిన తనయుడు రామ్ చరణ్ ఇప్పుడు తండ్రితో కలసి వెండితెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నాడు. వీరిద్దరూ కలసి ఓ చిత్రంలో నటిస్తారంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 151వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజే ఆ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఇక ఇందులో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడన్నది విశ్వసనీయ సమాచారం. ఒక సోషల్ మెసేజ్ నేపథ్యంలో ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో చరణ్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. సో.. మెగా అభిమానులకు ఈ పండగ పూట ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి!  
Tue, Oct 08, 2019, 01:38 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View