బాలయ్య 105వ చిత్రం కొత్త పోస్టర్ విడుదల
Advertisement
బాలయ్య 105వ చిత్రం షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలయ్య కొత్త గెటప్ లో ఆకట్టుకుంటున్నారు. కాసేపటి క్రితం మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముఖమంతా పసుపు, కుంకుమ ఎగిరిపడినట్టు, రక్తం కారుతున్న కత్తిని చేత్తో పట్టుకుని బాలయ్య ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. భారీ యాక్షన్ సన్నివేశానికి చెందినట్టుగా పోస్టర్ కనిపిస్తోంది. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు కాగా... ప్రకాశ్ రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Mon, Oct 07, 2019, 05:44 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View