దసరా కానుకగా మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' స్పెషల్ పోస్టర్ విడుదల
Advertisement
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చాన్నాళ్ల తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, దసరా సందర్భంగా మహేశ్ బాబు అభిమానుల కోసం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

ఆ పోస్టర్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుండగా, ఆర్మీ ప్యాంట్ పైన క్యాజువల్ షర్ట్ ధరించిన మహేశ్ చేతిలో గొడ్డలితో రౌద్రం ప్రదర్శిస్తున్నాడు. మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. "హ్యాపీ దసరా" అంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
Mon, Oct 07, 2019, 05:20 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View