నీకు రెండు ఇంగ్లీషు ముక్కలు నేర్పించి దేవుడు తప్పు చేశాడు: బండ్ల గణేశ్
Advertisement
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, మరో నిర్మాత పీవీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీవీపీ పేరును నేరుగా ప్రస్తావించకుండా... 'స్కామ్ రాజా' అంటూ బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించారు. తన క్యారెక్టర్ ఏమిటో సినీరంగ పెద్ద, యాభై ఏళ్లుగా ఫైనాన్సియర్ గా ఉన్న సత్తి రంగయ్యను అడిగి తెలుసుకోవాలని అన్నారు. క్యారెక్టర్ లేని వ్యక్తి తన గురించి ఏంటి చెప్పేది అని ఎద్దేవా చేశారు.

తాను ఉండేది, చచ్చిపోయేది హైదరాబాదులోనేనని... నువ్వు ఇండియాలో ఉండవనే సంగతి తనకు తెలుసని చెప్పారు. గోవాలో ఒక ఇల్లు, లండన్ లో మరో ఇల్లు కట్టుకుంటున్నావని అన్నారు. స్కామ్ ల నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నావంటూ వ్యాఖ్యానించారు. స్కామ్ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ నిలుస్తావని విమర్శించారు. నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి భగవంతుడు తప్పు చేశాడని అన్నారు.
Mon, Oct 07, 2019, 03:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View